: అఫ్రిది సేనకు 'షేమ్ షేమ్' స్వాగతం!


వరల్డ్ కప్ టీ-20 పోటీల్లో భాగంగా భారత్ తో ఓటమి పాలై, ఆపై సెమీస్ చేరలేకపోయిన పాకిస్థాన్ జట్టుకు ఆ దేశంలో చేదు అనుభవం ఎదురైంది. పెద్దగా సందడి లేకుండా లాహోర్ విమానాశ్రయానికి చేరుకున్న ఆటగాళ్లను చూసిన ప్రయాణికులు 'షేమ్ షేమ్' అంటూ నినాదాలు చేశారు. కెప్టెన్ అఫ్రిది మినహా మిగతా జట్టు ఆటగాళ్లంతా అల్లామా ఇక్బాల్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు చేరుకోగా, అభిమానుల వ్యతిరేక నినాదాలతో ఎయిర్ పోర్టు మారుమోగింది. పటిష్ఠ భద్రత మధ్య వారు తమ నివాసాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా, కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాలన్న ఉద్దేశంతో అఫ్రిది దుబాయ్ వెళ్లిపోయాడు. మరో రెండు రోజుల్లో ఆయన తన క్రీడా భవిష్యత్ పై కీలక ప్రకటన చేయవచ్చని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News