: దుబాయ్ లో ఉద్యోగాలు ఇప్పిస్తున్న కేసీఆర్ సర్కారు... రేపటి నుంచి మూడు రోజుల పాటు ఎంపిక!
ఇకపై దుబాయ్, సౌదీ అరేబియాల్లో ఉద్యోగాల పేరిట తెలంగాణ నిరుద్యోగులు మోసపోకూడదన్న ఉద్దేశంతో కేసీఆర్ ప్రకటించిన టామ్ కామ్ (తెలంగాణ మ్యాన్ పవర్ కంపెనీ) తొలి అడుగులు రేపు పడనున్నాయి. మొత్తం 750 మందికి దుబాయ్ లో ఉపాధి కల్పించడమే లక్ష్యంగా అక్కడి సంస్థలతో డీల్స్ కుదుర్చుకున్న టామ్ కామ్, తొలి దశలో 250 మందికి ఉపాధి కల్పించనుంది. రేపటి నుంచి మూడు రోజుల పాటు హైదరాబాద్, నిజామాబాద్ లలో ఎంపిక కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఎలక్ట్రీషియన్లు, డ్రైవర్లు, హెల్పర్లకు అవకాశం దక్కనుంది. హైదరాబాద్ లోని మల్లేపల్లిలో ఉన్న టామ్ కామ్ లో రెండు రోజుల పాటు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకూ మౌఖిక పరీక్షలు ఉంటాయని, 1వ తేదీన నిజామాబాద్ లోని ఐటీఐ క్యాంపస్ లో ఇంటర్వ్యూలు ఉంటాయని అధికారులు వెల్లడించారు. ఉద్యోగాలు కావాల్సిన వారు, వారి అన్ని ధ్రువీకరణ పత్రాలు, పాస్ పోర్టు, కలర్ ఫోటోలు తీసుకురావాలని కోరారు.