: సినీ నటుడు ఉదయ్ ని కస్టడీకి అడిగిన జూబ్లీహిల్స్ పోలీసులు


'ఫ్రెండ్స్ బుక్' సినిమాతో టాలీవుడ్ లో రంగప్రవేశం చేసిన ఉదయ్ ను రెండు రోజుల కస్టడీకి అప్పగించాలని హైదరాబాదు జూబ్లిహిల్స్ పోలీసులు న్యాయస్థానాన్ని కోరారు. ఈనెల 23న 'ఓవర్ ది మూన్' పబ్ కి వచ్చిన ఉదయ్ ను బౌన్సర్లు లోపలికి అనుమతించకపోవడంతో అక్కడున్న ఫర్నిచర్, అద్దాలను ధ్వంసం చేసి, సిబ్బందిపై దాడికి దిగాడు. ఇందుకు సంబంధించిన వీడియో పుటేజ్ ను నిన్న విడుదల చేసి, అతనిని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. నాంపల్లి కోర్టులో అతనిని ప్రవేశపెట్టిన సందర్భంగా రెండు రోజుల పోలీస్ కస్టడీకి ఇవ్వాలని కోరారు. దీనిపై న్యాయస్థానం విచారణను రేపటికి వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News