: యూఎస్ రోడ్లపై ఫోన్ మెస్సేజ్ లు చేసినా, చూసినా నేరమే!


అమెరికా రోడ్లపై వెళ్లేటప్పుడు ఫోన్ మెస్సేజ్ లు చేసినా, చూసినా నేరమేనట. కదిలే సమయంలో ఫోన్ లో చిన్నపాటి బ్లూ స్క్రీన్ చూడటం వల్ల కళ్లకు తీవ్రహాని కలగడంతో పాటు, ప్రమాదాలకు ఆస్కారం ఉంది. ఈ నేపథ్యంలోనే న్యూజెర్సీ లోని చట్టసభ సభ్యురాలు పమేలా లాంపిట్ దీనిని చట్ట విరుద్ధంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. రోడ్లపై పాదచారులు నడిచి వెళ్లేటప్పుడు ఫోన్ మెస్సేజ్ లు టైప్ చేయడం, లేదా చదవడం వంటి వాటిని నిషేధించాలని, చట్ట విరుద్ధంగా పరిగణించాలని చట్టసభలో కోరారు. చట్ట ఉల్లంఘనకు పాల్పడిన వారికి 50 డాలర్ల జరిమానాతో పాటు 15 రోజుల జైలు శిక్షను కూడా అమలు చేయాలని పమేలా లాంపిట్ కోరారు. కాగా, గ్లోబల్ మీడియా కంపెనీ మాషబుల్ లెక్కల ప్రకారం అమెరికాలో పాదచారుల మరణాలు రోజురోజుకూ పెరుగుతున్నట్లు గమనించారు. 2005లో పాదచారుల మృతుల శాతం 11 ఉండగా, 2014 నాటికి 15 శాతానికి పెరిగినట్లు మాషబుల్ సర్వేలో తేలింది. రోడ్లపై నడుస్తూ, డ్రైవింగ్ చేస్తూ ఫోన్లు మాట్లాడకూడదనే ట్రాఫిక్ నిబంధన అమెరికాలో ఇప్పటికే ఉంది. హవాయిలో రోడ్డు దాటుతుండగా ఫోన్ మాట్లాడితే 250 డాలర్ల జరిమానా కట్టాలనే నిబంధనకు సంబంధించి రూపొందించిన బిల్లు పెండింగ్ లో ఉంది.

  • Loading...

More Telugu News