: 'బ్రయాన్ లారా'ని అధిగమించిన కోహ్లీ...వారిద్దరినీ గుర్తుకు తెస్తున్నాడు: ఇయాన్ ఛాపెల్
టీ20 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా-భారత జట్ల మధ్య జరిగిన మ్యాచ్ విరాట్ కోహ్లీకి ఎనలేని పేరుప్రతిష్ఠలు తీసుకొచ్చింది. దేశవిదేశాల్లోని క్రికెట్ దిగ్గజాలు విరాట్ కోహ్లీ ఆటతీరుపై ప్రశంసలు కురిపిస్తున్నాయి. కోహ్లీ ఆటతీరును తాజాగా ఆసీస్ మాజీ కెప్టెన్, క్రికెట్ దిగ్గజం ఇయాన్ ఛాపెల్ ఆకాశానికెత్తారు. కోహ్లీ ఆటతీరు అత్యద్భుతమని ఆయన అభిప్రాయపడ్డారు. మణికట్టు ఉపయోగించి చక్కని టైమింగ్ తో షాట్లు కొట్టడంలో బ్రయాన్ లారా సిద్ధహస్తుడని, అలాంటి అత్యద్భుతమైన టైమింగ్ షాట్లతో కోహ్లీ లారాను అధిగమించాడని ఆయన అభిప్రాయపడ్డారు. భారత్ లో మణికట్టుతో విన్యాసాలు చేసే మహమ్మద్ అజహరుద్దీన్, వీవీఎస్ లక్ష్మణ్ ను కోహ్లీ గుర్తుకు తెస్తున్నాడని ఆయన పేర్కొన్నారు. కోహ్లీ కెరీర్ లో ఆసీస్ పై సాధించిన 82 పరుగుల ఇన్నింగ్స్ ఉత్తమమైన ఇన్నింగ్స్ అని ఆయన తెలిపారు. మణికట్టుతో పవర్ ఫుల్ షాట్లు అడగలగడం కోహ్లీ ప్రత్యేకత అని ఆయన పేర్కొన్నారు.