: నడిరోడ్డుపై డ్యాన్స్ చేస్తున్న కూతురు చెంపను ఛెళ్లుమనిపించిన తల్లి!
ప్రస్తుత సమాజంలో సంప్రదాయానికి భిన్నంగా ఏదైనా చేస్తే...అది గ్రేట్ అనే భావం యువతరంలో నాటుకుపోయింది. దీంతో వినూత్న కార్యక్రమాలతో యువత ఆకట్టుకుంటోంది. కొంత మంది సరికొత్త పరిశోధనలు, కెరీర్ వైపు దూసుకుపోతుంటే...మరికొంతమంది కాలేజీ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇలాంటి మార్గంలో వెళుతున్న కుమార్తెకు కేరళలో ఓ తల్లి గట్టిగా బుద్ధి చెప్పింది. కేరళలోని కన్నూరు నగరంలో ఓ కళాశాలకు చెందిన యువతీయువకులు బస్టాండ్ దగ్గర ఫ్లాష్ మాబ్ నిర్వహించారు. ఈ బృందంలో ఓ యువతి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచి డ్యాన్స్ వేస్తుండగా ఓ మధ్య వయస్కురాలు వచ్చి ఆ యువతి చెంప ఛెళ్లుమనిపించింది. దీంతో ఫ్లాష్ మాబ్ చేస్తున్న బృందం అవాక్కైంది. ఆమెను నిలువరించేందుకు కొంతమంది ప్రయత్నించగా...ఆగ్రహించిన ఆమె...తన కుమార్తెను చదువుకునేందుకు కాలేజీకి పంపితే...అది వేస్తున్న వేషాలు ఇవా? అని మండిపడింది. రేపు ఆమె భవిష్యత్ బుగ్గిపాలైతే బాధ్యత ఎవరిది? బాధపడేది ఎవరు? అంటూ ఆమె నిలదీసింది. దీంతో అంతవరకు ఫ్లాష్ మాబ్ ను ఎంజాయ్ చేస్తున్న ప్రతిఒక్కరూ మౌనంగా అక్కడి నుంచి నిష్క్రమించారు.