: కేరళవాసి ఫాదర్ ఉజున్నలిల్‌ను శిలువ వేసి హతమార్చిన ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు
ఈ నెల 4న యెమెన్‌లో ఉగ్రవాదులు అపహరించారని భావిస్తున్న కేరళకు చెందిన ఫాదర్ ఉజున్నలిల్‌ను.. గుడ్ ఫ్రైడే రోజున ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) ఉగ్రవాదులు హతమార్చారు. ఈ విషయాన్ని అమెరికా మీడియా ప్రచురించింది. మదర్ థెరెస్సా మిషనరీలో పని చేస్తున్న కాథలిక్ మతానికి చెందిన ఫాదర్ ఉజున్నలిల్ ను కొంతమంది దుండగులు అపహరించుకుపోయి, శిలువ వేసి చంపేసినట్లు తెలుస్తోంది. యెమెన్‌లో మదర్ థెరిస్సా చారిటీ మిషనరీలు నిర్వహిస్తున్న కేర్ హోమ్‌పై గత నెలలో ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) ఉగ్రవాదులు దాడి చేసిన నాటి నుంచి ఫాదర్ ఉజున్నలిల్ కనిపించడం లేదు. కొన్ని రోజుల క్రితమే కేరళకు చెందిన ఫాదర్ టామ్ ఉజున్నలిల్‌ను ఉగ్రవాదులు కిడ్నాప్ చేసినట్లు కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ధ్రువీకరించారు. ఆయనను రక్షించేందుకు తక్షణ చర్యలు చేపట్టినట్లు ఆమె ట్వీట్ చేశారు. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.