: వడగాలులపై కార్యాచరణ ప్రణాళిక సమర్పించండి: తెలుగు రాష్ట్రాలకు హైకోర్టు ఆదేశం
తెలుగు రాష్ట్రాలలో వడగాలులపై కార్యాచరణ ప్రణాళికను తక్షణం అమలు చేయాలని ఆయా ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. దీనికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు హైకోర్టుకు సమర్పించాయి. ఎండల్లో ప్రజలు బయటకు వెళ్లకుండా వారిలో చైతన్యం కల్పించాలని, ఎండ ఉన్న సమయంలో పొలాల్లో కార్మికులు పనిచేయకుండా చూడాలని రెండు తెలుగు ప్రభుత్వాలకు ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.