: నేడు హ‌ర్యానా శాస‌న‌ సభలో జాట్‌ రిజర్వేషన్ల బిల్లు


జాట్ల ఆందోళనకు దిగొచ్చి.. రిజర్వేషన్లు కల్పించేందుకు హర్యానా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విష‌యం తెలిసిందే. అసెంబ్లీ సమావేశాల్లో జాట్ల రిజర్వేషన్ల బిల్లును ప్రవేశపెట్టాలని ఇప్ప‌టికే నిర్ణ‌యించిన ప్ర‌భుత్వం... నేడు శాస‌న‌స‌భ ముందుకు ఆ బిల్లును తీసుకురానున్న‌ట్లు స‌మాచారం. జాట్ల రిజర్వేషన్ల బిల్లుపై హర్యానా మంత్రివర్గం ఇప్పటికే చ‌ర్చించి, ఆమోదం తెలిపింది. ఈ బిల్లును నేడు శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. కొన్ని రోజుల క్రితం హర్యానాలో జాట్ల రిజర్వేషన్ల ఉద్యమంతో రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం కలిగింది. నిరసనకారులు ప్రభుత్వ ఆస్తులను, రైళ్లను, బస్సులను టార్గెట్ చేసి విధ్వంసానికి పాల్పడ్డారు. దీంతో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న విష‌యం తెలిసిందే.

  • Loading...

More Telugu News