: వారు దోషులే... కస్టడీకి తీసుకోండి: బొగ్గు గనుల కుంభకోణం కేసులో కోర్టు తీర్పు


దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బొగ్గు గనుల కుంభకోణం కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి భరత్ ప్రశాంత్ తన తీర్పును వెలువరించారు. జార్ఖండ్ ఇస్పాత్ ప్రైవేట్ లిమిటెడ్ లోని ఇద్దరు డైరెక్టర్లు ఆర్ఎస్ రుంగ్తా, ఆర్సీ రుంగ్తాలు దోషులని, వారిని తక్షణం కస్టడీలోకి తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. గత సంవత్సరం మార్చి 21న వీరిపై సీబీఐ అభియోగపత్రాలను దాఖలు చేసిన సంగతి తెలిసిందే. వీరు తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి, వాటిని అసలైనవిగా చూపి బొగ్గు క్షేత్రాలను దక్కించుకున్నారని విచారణలో వెల్లడైందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. కాగా, వీరిద్దరికీ ఎంత శిక్ష పడిందన్నది మరికాసేపట్లో తేలనుంది.

  • Loading...

More Telugu News