: మహేశ్ బాబు నిన్న ఫోన్ చేసి ఇరవై నిమిషాలు మాట్లాడాడు: నాగార్జున
'ఊపిరి' చిత్రంపై ప్రశంసల వర్షం కురుస్తోందని ప్రముఖ నటుడు నాగార్జున అన్నారు. ఒక టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘దర్శకుడు శ్రీను వైట్ల తన మెస్సేజ్ లో ఏమన్నాడంటే.. ఇటువంటి సినిమాలు తీయడం ద్వారా దర్శకులకు ఇన్సిపిరేషన్ గా నిలిచారు. కథలు అయిపోతున్నప్పుడు కొత్త కథలు ఉన్నాయన్న విషయాన్ని గుర్తు చేశారు' అన్నాడు. ఆ తర్వాత శ్రీనుకు నేనొక మెస్సేజ్ పెట్టాను. మరో దర్శకుడు వివి వినాయక్ కూడా కంగ్రాట్స్ చెప్పారు. కరెక్టుగా తీస్తే ఎటువంటి కథనైనా తెలుగు వాళ్లు చూస్తారు అనే నమ్మకం వచ్చిందని వినాయక్ అన్నాడు. మహేశ్ అయితే నిన్న నాకు ఫోన్ చేసి ఇరవై నిమిషాలు మాట్లాడాడు. 'వాట్ ఈజ్ దిస్.. ఫంటాస్టిక్?' అన్నాడు. మహేశ్ చాలా ఇన్ స్పైర్ అయ్యాడు. ఈ చిత్రం చేయడం ద్వారా మాకు కాన్ఫిడెన్స్ ఇచ్చారని మహేష్ అన్నాడు’ అన్నారు నాగార్జున.