: కోహ్లిపై ఆసీస్ మాజీ బౌలర్ కామెంట్లు


టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లిపై ఆసీస్ మాజీ ఫాస్ట్ బౌలర్ మిచేల్ జాన్సన్ తన ట్వీట్లతో మాటల దాడికి దిగాడు. ఆస్ట్రేలియాతో పోరు అనగానే ప్రత్యర్థి క్రీడాకారులపై వారి మాటల దాడి, స్లెడ్జింగ్ గుర్తుకొస్తాయి. ఈ నేపథ్యంలోనే స్లెడ్జింగ్ ను ఎదుర్కొనేందుకు తాను సిద్ధమని, పాజిటివ్ గా తీసుకుంటానని, ఒక లక్ష్యంతో మైదానంలోకి అడుగుపెడితే, ఎవరి వ్యాఖ్యలను లెక్కచేయనని కోహ్లి పేర్కొన్నాడు. కోహ్లి చేసిన ఈ వ్యాఖ్యలపై మిచేల్ ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేశాడు. గత ఏడాదిలో జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్ లో ఎందుకు విఫలమయ్యావంటూ కోహ్లీని ప్రశ్నించాడు.

  • Loading...

More Telugu News