: 31న మోదీ, షరీఫ్ ల భేటీ!
ఈ నెలాఖరులో భారత, పాక్ దేశాల ప్రధానులు భేటీ కానున్నట్లు తెలుస్తోంది. మార్చి 31న అమెరికాలో జరగనున్న అణుభద్రతపై శిఖరాగ్ర సమావేశం నేపథ్యంలో వీరు భేటీ కానున్నట్లు సమాచారం. కాగా, ఈ నెల 30 నుంచి మూడు దేశాల పర్యటనకు మోడీ వెళ్లనున్నారు. బెల్జియం, అమెరికా, సౌదీ అరేబియాల్లో మోదీ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. మార్చి 31న వాషింగ్టన్ లో జరగనున్న అణుభద్రతపై శిఖరాగ్ర సమావేశానికి పాక్ ప్రధాని షరీఫ్ కూడా హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరు ప్రధానులు సమావేశం కానున్నట్లు సమాచారం.