: ప్రజల తరపున టీజేఏసీ పోరాడుతుంది: ప్రొఫెసర్ కోదండరాం
ప్రజల కోసమే టీ-జేఏసీ పనిచేస్తుందని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. హైదరాబాద్ లో టీజేఏసీ సమావేశం ముగిసింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రజల గొంతుకగా నిలవాలని చాలా కచ్చితంగా అనుకున్నామని, ప్రతి సంఘానికి ఒక స్వేచ్ఛ ఉంటుంది, వాళ్ల నిర్ణయం వాళ్లు తీసుకునే అధికారం కూడా ఉంటుంది అని అన్నారు. ఇంతకాలం తమతో పాటు కలిసి పనిచేసినటువంటి సంఘాలు తీసుకున్న నిర్ణయాలపై చర్చ చేయడం సమంజసం కాదని అనుకున్నామన్నారు. పలు ఉద్యమాల్లో ఆయా సంఘాలు కూడా తమతో పాటు గతంలో పాల్గొన్నాయని, వారి పాత్రను మరవలేమని, కచ్చితంగా గుర్తుంచుకుంటామని ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నానని అన్నారు. అదేవిధంగా ఉద్యోగస్తుల సమస్యల పరిష్కారానికి జరిగే ఏ ప్రయాత్నాల్లోనైనా తమ వంతు పాత్ర, భాగస్వామ్యం కూడా ఉంటాయని కోదండరాం అన్నారు.