: ప్రేమ విఫలమై కోచింగ్ సెంటర్ భవంతిపై నుంచి దూకిన సీఏ విద్యార్థిని శ్రావణి!


చార్టెడ్ ఎకౌంటెన్సీ కోర్సు చేస్తున్న శ్రావణి అనే యువతి, తాను చదువుతున్న సెంటరు భవంతి పైనుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన ఆదివారం నాడు హైదరాబాదు, కూకట్ పల్లిలో జరుగగా, ప్రేమ విఫలమే దీనికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. భవంతి పైనుంచి దూకిన శ్రావణిని కోచింగ్ సెంటర్ యాజమాన్యం ఆసుపత్రికి తరలించగా, తీవ్రగాయాలతో ఉన్న ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. కాగా, కరీంనగర్ కు చెందిన శ్రావణి గత కొంత కాలంగా హైదరాబాద్ లో ఉంటూ ఉన్నత విద్యాభ్యాసం చేస్తోంది. ఘటన గురించి తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు హుటాహుటిన హైదరాబాద్ వచ్చి కన్నీరు మున్నీరయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News