: ఆస్ట్రేలియా కోసం యువరాజ్ ప్రత్యేక శిక్షణ
ఆస్ట్రేలియాతో అత్యంత కీలకమైన పోరు నేడు జరగనున్న తరుణంలో యువరాజ్ సింగ్ తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఈ మ్యాచ్ లో మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ కు వచ్చే అవకాశాలున్న నేపథ్యంలో పరిస్థితులకు తగ్గట్టు ఆడేందుకు, భారత జట్టు అసిస్టెంట్ కోచ్ సంజయ్ బంగర్ నుంచి సలహాలు తీసుకుని కఠోర ప్రాక్టీస్ చేశాడు. తప్పనిసరిగా గెలవాల్సిన ఈ మ్యాచ్ లో సత్తా చాటాలన్నది యువరాజ్ అభిమతంగా తెలుస్తోంది. బంగ్లాదేశ్, న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లలో పెద్దగా పరుగులు చేయలేకపోయిన యువరాజ్, పాక్ తో మ్యాచ్ లో మాత్రం ఫర్వాలేదనిపించుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ ప్రత్యేక శిక్షణ ఏ మేరకు జట్టుకు లాభిస్తుందన్నది తెలియాలంటే రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్ చూడక తప్పదు.