: మెట్టు దిగిన జ్యోతుల... చెవిరెడ్డిని లోనికి తీసుకెళ్లి రహస్య చర్చలు!
ఈ ఉదయం నుంచి తనను కలిసేందుకు ఇంటి ముందు వేచి చూస్తున్న మిత్రుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ స్వయంగా ఇంట్లోకి ఆహ్వానించారు. ప్రస్తుతం ఆయనతో రహస్యంగా మంతనాలు జరుపుతున్నారు. వైకాపా అధినేత జగన్ ఆదేశాల మేరకు చెవిరెడ్డి ఆయన ఇంటికి రాగా, తొలుత కలిసేందుకు అంగీకరించని ఆయన, ఆపై మెట్టు దిగారు. కాగా, ఒక్కసారి జగన్ తో ఫోన్లో మాట్లాడాలని జ్యోతుల నెహ్రూను చెవిరెడ్డి కోరినట్టు తెలుస్తోంది. వీరిద్దరి భేటీకి సంబంధించిన మరింత సమాచారం వెలువడాల్సి వుంది.