: సీనియర్ నటి కేఆర్ విజయ భర్త వేలాయుధమ్ కన్నుమూత
తమిళ నిర్మాత, సీనియర్ నటి కేఆర్ విజయ భర్త సుదర్శన్ వేలాయుధం కేరళలోని క్యాలికట్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కన్నుమూశారు. వృద్ధాప్యం కారణంగా వచ్చిన అనారోగ్యాలతో గత కొంత కాలంగా చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించిన నేపథ్యంలో మరణించారని కేఆర్ విజయ తెలిపారు. ఆయన కోరిక మేరకే తాము క్యాలికట్ లో ఉంటున్నామని, ఆయన అంత్యక్రియలు సైతం ఇక్కడే జరుగుతాయని తెలిపారు. వీరికి హేమలత అనే కుమార్తె ఉన్న సంగతి తెలిసిందే. ఆయన మృతికి తమిళ చిత్ర ప్రముఖులతో పాటు పలువురు నటీ నటులు, సాంకేతిక సిబ్బంది సంతాపం తెలిపారు.