: ఎవరెస్ట్ పై పగుళ్లు, బిలాలు... భూకంపమే కారణమట!


ప్రపంచంలోనే ఎత్తయిన శిఖరంగా, పర్వతారోహకుల తుది లక్ష్యంగా నిలిచే ఎవరెస్ట్ పర్వతానికి బీటలు వారాయని, పలు చోట్ల భారీ బిలాలు ఏర్పడ్డాయని తెలుస్తోంది. గత సంవత్సరం నేపాల్ లో వచ్చిన భూకంపమే ఇందుకు కారణమని నేపాల్ మౌంటెనీరింగ్ అసోసియేషన్ చైర్మన్ ఆంగ్ త్సెరింగ్ షేర్పా వ్యాఖ్యానించారు. ఏప్రిల్ 25న వచ్చిన భూకంపానికి 9 వేల మందికి పైగా మరణించారని, దీని ప్రభావంతో ఎవరెస్టుకు నష్టం వాటిల్లిందని వివరించారు. ఎవరెస్టుకు ఏర్పడిన పగుళ్ల స్థాయిని పరిశీలిస్తున్నామని, వాటి మధ్య అల్యూమినియం నిచ్చెనలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. మొత్తం పనులు పూర్తయ్యేందుకు మరింత సమయం పట్టవచ్చని తెలిపారు. నిచ్చెనలు, రోప్స్ ఏర్పాటు చేసి ఎవరెస్ట్ ను సురక్షితంగా మార్చే పనులను 'సాగరమాతా పొల్యూషన్ కంట్రోల్' కమిటీకి అప్పగించినట్టు ఆయన తెలియజేశారు. కాగా, భారీ భూకంపం తరువాత రిక్టర్ స్కేలుపై 4 కన్నా అధిక మ్యాగ్నిట్యూడ్ తో దాదాపు 440కి పైగా ప్రకంపనలు నమోదైన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News