: రన్ వే పక్కనే కుప్పకూలిన విమానం... నలుగురి మృతి
జపాన్ లో తేలికపాటి విమానం రన్ వే పక్కనే కుప్పకూలిన ఘటన చోటుచేసుకుంది. జపాన్ లోని కోబ్ విమానాశ్రయం నుంచి బయల్దేరిన సింగిల్ ఇంజిన్ విమానం యావో నగరంలోని విమానాశ్రయంలో రన్ వేపై దిగుతుండగా రన్ వే పక్కనే కుప్పకూలింది. ఈ ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు మృత్యువాత పడ్డారని అధికారులు వెల్లడించారు. ఈ ఘటన జరిగిన సమయంలో విమానం కుప్పకూలిన ప్రాంతంలో ఎవరూ లేరని వారు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసిన అధికారులు, దర్యాప్తు చేపట్టారని తెలిపారు.