: మీరు తప్పకుండా రావాలి: సచిన్ ను ఆహ్వానించిన విజేందర్ సింగ్
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ను డబ్ల్యూబీవో ఆసియా టైటిల్ ఫైట్ కు రావాల్సిందిగా భారత ప్రొఫెషనల్ బాక్సర్ విజేందర్ సింగ్ ఆహ్వానించాడు. సచిన్ ను ముంబైలో కలిసిన అనంతరం విజేందర్ సింగ్ సోషల్ మీడియాలో అంత గొప్ప వ్యక్తిని కలవడం ఆనందంగా ఉందని సంతోషం వ్యక్తం చేశాడు. తనను కలిసేందుకు అవకాశం ఇచ్చిన సచిన్ కు విజేందర్ ధన్యవాదాలు చెప్పాడు. జూన్ 11న ఈ మ్యాచ్ జరగనుందని, ఈ మ్యాచ్ కు హాజరు కావాల్సిందిగా సచిన్ ను కోరినట్టు తెలిపాడు. ఈ సందర్భంగా సచిన్ తో దిగిన ఫోటోను పోస్టు చేశాడు. కాగా, గత వారం ప్రధాని మోదీని కలిసిన విజేందర్ ఆయనను కూడా ఈ మ్యాచ్ చూసేందుకు రావాలని కోరిన సంగతి తెలిసిందే.