: స్లో ఓవర్‌ రేటు... బంగ్లా టీమ్‌కు ఐసీసీ జ‌రిమానా!


బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుకు ఐసీసీ జరిమానా విధించింది. టీ20 వ‌రల్డ్‌ కప్ లో భాగంగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్‌ రేటు కారణంగా బంగ్లాదేశ్‌ జట్టుకు జ‌రిమానా భారం ప‌డింది. ఈ విషయమై ఐసీసీ ఓ ప్రకటన విడుదల చేసింది. నిర్దేశిత సమయానికి 20 ఓవర్లు పూర్తి చేయకపోవడంతో జరిమానా విధించినట్లు ఐసీసీ తెలిపింది. ఈ జరిమానాతో టీ20 జట్టు కెప్టెన్‌ మోర్తజాకి 20 శాతం, క్రీడాకారులకు 10 శాతం మేర మ్యాచ్‌ ఫీజుల్లో కోత పడనుంది. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ మెగా టోర్నీలో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య హైటెన్షన్ మ్యాచ్ జరిగి, చివ‌రకు విజ‌యం భార‌త్‌ను వ‌రించిన సంగ‌తి తెలిసిందే. భారత్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ ఒక పరుగు తేడాతో ఓడిపోయింది.

  • Loading...

More Telugu News