: వేస‌విలో ఆరోగ్యాన్నీ, అందాన్నీ ఇలా జాగ్ర‌త్త‌గా కాపాడుకుందాం!


ఎండ‌లు దంచికొడుతున్నాయి. మరి, ఎండాకాలంలో ఆరోగ్యం, అందం పాడ‌వుతాయేమోనని బాధ‌ప‌డ‌ని వారుండ‌రు. నేడు మ‌నిషి ఆరోగ్యంతో పాటు అందానికీ ప్రాముఖ్య‌త‌నిస్తున్నాడు. అందుకే, ఉక్కపోతతో మహా చిరాకుగా ఉంటే.. అలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఎలాంటి దుస్తులు ధ‌రించాలో, ఎండ‌వేడికి ఎలాంటి జాగ్ర‌త్తలు తీసుకోవాలో, అందాన్ని ఎలా కాపాడుకోవాలో ఓసారి చూద్దాం. ఎండాకాలంలో రెండు పూటలా స్నానం చేయాలి. పళ్లు, కూరగాయలు ఎక్కువగా తినాలి. మసాలాలు తగ్గించాలి. దోమలు కుట్టకుండా రాత్రి పూట పైజామా లాల్చీ లాంటి బట్టలు వేసుకోవాలి. తాజా ఆహారం మాత్రమే తినేలా జాగ్రత్తలు తీసుకోవాలి. బయటకి వెళ్లాలంటే సరైన సమయాన్ని చూసుకోవాలి. ముఖ్యంగా మ‌ధ్యాహ్నం 12 నుంచి సాయంత్ర‌ 6 వ‌ర‌కు బ‌య‌ట‌కు రాకుండా స‌మ‌యాన్ని స‌ర్దుబాటు చేసుకుంటే మంచిది. రోజూ రకరకాల ద్రవాలు తాగాలి. ఏ వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి. ఇంట్లో వాతావరణం చల్లగా ఉండే విధంగా చూసుకోవాలి. ఈ కాలంలో మజ్జిగ శ‌రీరానికి బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇది శరీరానికి చాలా మేలు చేస్తుంది. పెరుగు తినాల్సి వస్తే దానికి కొంచెం నీరు, పంచదార, ఉసిరికాయలు, తేనే కలిపి తింటే శరీర ఉష్ణోగ్రత తగ్గడంతోపాటు వడదెబ్బ నుంచి కాపాడుకోవచ్చు. వేసవికాలంలో పదార్థాలు పాడవుతాయని ఫ్రిజ్‌లో నిల్వ చేస్తుంటాం. ఇలా చేసేటప్పుడు కొన్ని వండనివీ, కొన్ని వండినవీ ఉంటాయి. అలాంటప్పుడు జాగ్రత్తగా అన్నింటికీ మూతలుపెట్టాలి. అందాన్ని కాపాడుకుందాం.. ఎండలోకి తప్పనిసరిగా వెళ్లేవారు సన్‌స్క్రీన్ లోషన్స్ తప్పనిసరిగా వాడాలి. పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు తాగడం ఆరోగ్యానికే కాదు అందానికీ మంచిదే. రోజుకు కనీసం నాలుగు లీటర్ల మంచినీరు తప్పక తీసుకోవాలి. ఎండలో బయటికి వెళ్లే సమయంలో కళ్లద్దాలు, సన్‌ స్కీన్‌ లోషన్లు వాడాలి. చెమట పట్టి చెమట గ్రంథులు మూసుకుపోతే వ్యర్థ పదార్థాలు పేరుకుపోతాయి. అంతేకాక, చెమట వల్ల శరీరం చల్లబడే ప్రక్రియ దెబ్బతిని వడదెబ్బ తగలవచ్చు. చర్మంపై పేరుకుపోయిన వ్యర్థాల వల్ల చెమట పొక్కులు రావచ్చు. దీంతో మీ అందం పాడ‌వుతుంది. కాబ‌ట్టి శ‌రీరంపై వ్య‌ర్థాలు పేరుకుపోయేలా చేసే చ‌మ‌ట రాకుండా త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. వేసవిలో ముఖంపై ఎక్కువగా జిడ్డు పేరుకుంటుంది. కనుక చల్లటి నీటితో కనీసం నాలుగైదు సార్లయినా కడుక్కోండి. ఎండలోంచి నీడకు వెళ్లిన వెంటనే కాకుండా కొంచెం సేపు ఆగి కడుక్కోండి. చ‌ర్మ ర‌క్ష‌ణ మండే ఎండలోనూ చాలా మంది బయటకు వెళ్లకుండా ఉండలేరు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవచ్చు. రోజంతా చర్మంపై తేమ ఉండేలా చూసుకోవాలి. ఇందుకోసం వాటర్ కలిసిన మాయిశ్చరైజింగ్ క్రీమును రాసుకోవాలి. దానికంటే ముందుగా ముఖంపై రోజ్ వాటర్‌ను రాసుకుంటే మంచిది. చర్మం బాగా పొడిబారిపోయినప్పుడు సబ్బుతో ఎక్కువ సార్లు కడుక్కోవద్దు. దీనికి బదులుగా వీలైనన్ని సార్లు చల్లటి నీటితో ముఖం కడుక్కుంటే తాజాగా ఉంటుంది. సూర్యుడి నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాలు చర్మంలోపలి పొరల్లోకి చొచ్చుకుపోయి కొల్లాజెన్‌ను దెబ్బతీస్తాయి. దీంతో చర్మంపై ముడతలు ఏర్పడతాయి. కనుక సాధ్యమైనంత వరకూ ఎండ ఎక్కువగా ఉండే సమయాల్లో బయటకు వెళ్లకుండా ఉంటే మంచిది. ఎండలో బయటకు వెళ్లడం తప్పదనుకుంటే ఎస్‌పీఎఫ్ 15 ఉన్న సన్‌స్క్రీన్ లోషన్‌ను శరీరంపై ఎండ పడే భాగాల్లో రాసుకోండి. ఐస్‌తో ముఖంపై మర్దన చేసుకుంటే చర్మం మరింత తాజాదనం సంతరించుకుంటుంది. స్క్రబ్బర్‌లను ఉపయోగించకండి. దానివల్ల చర్మం మరింత పొడిబారుతుంది. కళ్లపై ప్రభావం... ఎండాకాలం కళ్లకలక వేగంగా వ్యాపిస్తుంది. దుమ్మూధూళి వల్ల, వేడి వల్ల కంటి ఇన్‌ఫెక్షన్‌ త్వరగా పాకిపోతుంది. ఒకోసారి చూపు మందగించి, రెటినాపై కూడా ప్రభావం చూపవచ్చు. క‌నుక డాక్ట‌ర్ల స‌ల‌హాలు పాటించ‌డం మంచింది. ప‌ని చేస్తున్న‌ప్పుడు క‌నురెప్ప‌ల‌ను కాసేపు మూసి మీ వేళ్లతో మెల్లిగా కాసేపు మ‌ర్ధ‌న చేస్తే కంటికి కాస్త ఉపశ‌మ‌నం క‌లుగుతుంది. ఆహార నియమాలనుంచి నిద్ర వరకు వైద్యుల సలహాలు పాటించాలి. ఆహారం.. తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని కొంచెం కొంచెంగా తీసుకోండి. విలువైన పోషకాలుండే పుచ్చకాయ, ద్రాక్ష, కర్భూజ లాంటి పండ్లరసాలను ఎక్కువగా తీసుకోండి. మధ్యమధ్యలో చల్లని మజ్జిగ, కొబ్బరి నీరు తాగడం మరింత మంచిది. అలాగే కీరదోస, క్యారట్, బీట్‌రూట్ లాంటి పచ్చికూరగాయలను కూడా తినవచ్చు. టమాటా, నిమ్మరసంతో ముఖానికి ప్యాక్ వేసుకుంటే చర్మంపై జిడ్డు పూర్తిగా వదిలిపోతుంది. అంతేకాదు ముఖంపై ఉన్న బ్లాక్‌హెడ్స్ కూడా తగ్గిపోతాయి. ముఖంపై ర్యాషెస్ లేదా మొటిమలు ఉంటే మాత్రం నిమ్మరసాన్ని ఉపయోగించవద్దు. దుస్తులు.. సమ్మర్ సీజన్‌లో ముఖ్యంగా ఖాదీ వస్త్రాలు ధ‌రించ‌డం.. సౌకర్యవంతంగా ఉండడమే కాకుండా చాలా ఫాష్యన్‌గా కూడా ఉంటాయి. ఇంకా ఈ సమ్మర్‌లో ఖాదీతో నేసిన చీరలు, కుర్తాలు, స్కర్ట్స్ మరియు టాప్స్ ధరిస్తే చాలా బాగుంటాయి. ఈ సమ్మర్ సీజన్‌లో హాఫ్ ప్యాంట్స్ ధరించడం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. శరీరానికి గాలి ఫ్రీగా తగులుతుంది. మహిళలు ఈ సమ్మర్‌లో వీలైనంత వరకూ కాటన్ చీరలు ధరించాలి. పలుచని దుస్తులు ధరించాలి.. వేసవికాలంలో శరీరానికి అతుక్కొని, బిగుతుగా ఉండే దుస్తులను ధరించకండి. వదులుగా, కాటన్'తో తయారుచేసిన దుస్తులనే ధరించండి. దీని వలన మీ శరీరానికి గాలి తగిలి డీ-హైడ్రేషన్ జరిగే అవకాశం తక్కువగా వుంటుంది. అలాగే పల్చటి కాటన్ వస్త్రాలు, ముఖ్యంగా లైట్‌కలర్స్ ధరించడం మేలు. చేతులను కప్పివేసే షర్టులను ధరించండి. తలకు టోపి పెట్టుకోవడం లేదా గొడుగు వాడడం వల్ల సూర్యకిరణాల నుంచి రక్షణ లభిస్తుంది.

  • Loading...

More Telugu News