: అభినవ ఆంధ్రభోజుడు ‘ఆనందుడు’... 108 ఆలయాలకు ధర్మకర్తగా కొనసాగుతున్న వైనం
విజయనగర రాజవంశానికి చెందిన పూసపాటి ఆనంద గజపతిరాజు ముమ్మాటికీ అభివన ఆంధ్రభోజుడే. సింహాచలంలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ధర్మకర్తగా కొనసాగుతున్న ఆనంద గజపతిరాజు... రాష్ట్రంలోని 108 ఆలయాలకు కూడా ధర్మకర్తగా వ్యవహరిస్తున్నారు. మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ పదవిలోనూ ఆయన కొనసాగుతున్నారు. బొబ్బిలి లోక్ సభ నియోజకవర్గానికి రెండుసార్లు ఎంపీగా వ్యవహరించిన ఆయన, 1983లో రాజకీయ తెరంగేట్రం చేసి తొలిసారి భీమునిపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించి రెండుసార్లు కేబినెట్ మంత్రిగానూ ఆయన పదవీ బాధ్యతలు నిర్వర్తించారు.