: మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు... 30 మంది మృతి.. 65 మందికి గాయాలు


ఉగ్ర‌వాదుల దాడులు ప్ర‌పంచ వ్యాప్తంగా భ‌యాన‌క వాతావర‌ణాన్ని సృష్టిస్తున్నాయి. బ్ర‌స్సెల్స్ పేలుళ్ల నేప‌థ్యంలో జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నా ఉగ్ర‌వాదులు అంత‌కంత‌గా రెచ్చిపోతున్నారు. ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌ సమీపంలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. స్థానికంగా జరుగుతున్న ఓ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ వద్ద ఆత్మాహతి దాడులు జరిపారు. ఇస్కాన్‌దరియా నగర సమీపంలోని ఓ గ్రామంలో ఫుట్‌బాల్‌ పోటీలు జ‌రుగుతుండ‌గా ఓ వ్యక్తి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. దీంతో స్థానిక‌ నగర మేయర్‌ సహా 30 మంది మృతి చెందారు. 65 మందికి పైగా గాయపడ్డారు. దీంతో అక్క‌డ భ‌యాన‌క వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులే ఈ దారుణానికి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News