: జ్యోతుల సహా 10 మంది వైసీపీ ఎమ్మెల్యేలు జంప్?... వైసీపీలో కలకలం


జంపింగ్ లకు సంబంధించి నిన్న సాయంత్రం వెలువడ్డ పుకార్లు ఏపీలో ప్రతిపక్షం వైసీపీలో కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే వైసీపీ టికెట్ పై ఎమ్మెల్యేలుగా విజయం సాధించిన 8 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి షాకిస్తూ టీడీపీలో చేరిపోయారు. తాజాగా ఏపీ అసెంబ్లీలో ఆ పార్టీ శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ సహా మరో 9 మంది ఎమ్మెల్యేలు ‘సైకిల్’ ఎక్కేందుకు దాదాపుగా రంగం సిద్ధం చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ మొత్తం 10 మందిలో ఒక్క తూర్పు గోదావరి జిల్లా నుంచే జ్యోతుల సహా నలుగురు ఎమ్మెల్యేలున్నట్లు తెలుస్తోంది. ఇక మిగిలిన ఆరుగురు ఎమ్మెల్యేలు ఎవరన్న అంశంపై కూడా జోరుగా చర్చ సాగుతోంది. కాకినాడ నుంచి వెలువడిన తాజా ‘జంపింగ్’ వార్తలు మొత్తం రాష్ట్రంలోనే పెను చర్చకు దారి తీశాయి. ఇదే జరిగితే, వైసీపీ నుంచి ఏకంగా 18 మంది ఎమ్మెల్యేలు అధికార పక్షం టీడీపీలో చేరినట్టవుతుంది. వెరసి సభలో వైసీపీ బలం మరింతగా తగ్గిపోనుంది.

  • Loading...

More Telugu News