: సిద్దిపేట మున్సిపల్ ఎన్నికలు... 6 స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవం
మెదక్ జిల్లా సిద్దిపేట మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ ముగిసింది. మొత్తం 34 వార్డులకు గాను 6 స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవమైంది. 13,16,18,19,21,24 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. కాగా, వచ్చే నెల 6న పోలింగ్, 11న ఫలితాలు వెలువడనున్నాయి. కాగా, ఆరు గ్రామ పంచాయతీలను సిద్దిపేట మున్సిపాలిటీలో విలీనం చేయడానికి అనుకూలంగా హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం, ఆ పంచాయతీలను విలీనం చేస్తూ గతంలో మున్సిపల్ శాఖ నోటిఫై చేయడం తెలిసిందే. హైకోర్టు ఆదేశాల తర్వాతే సిద్దిపేట మున్సిపల్ ఎన్నికలకు మార్గం సుగమమైన విషయం విదితమే.