: మెదక్ జిల్లాలో శతాధిక వృద్ధురాలు మృతి
మెదక్ జిల్లాకు చెందిన శతాధిక వృద్ధురాలు అనారోగ్యం కారణంగా ఈరోజు మృతి చెందింది. జిన్నారం మండలం నల్తూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కొర్లకుంట గ్రామానికి చెందిన వృద్ధురాలు గంగనోళ్ల పెంటమ్మ(110) మృతి చెందిన విషయాన్ని ఆమె కుటుంబసభ్యులు తెలిపారు. మృతురాలి కుటుంబానికి టీడీపీ మండల అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి రూ.5 వేలు ఆర్థిక సాయం చేశారు. కాగా, శతాధిక వృద్ధురాలిని కడసారి చూసేందుకు గ్రామస్తులు తరలి వెళ్లారు.