: నేను బతికున్నంత వరకూ పోరాడుతూనే ఉంటా: మమతా బెనర్జీ
‘నేను బతికే ఉన్నాను. బతికున్నంత వరకూ పోరాడుతూనే ఉంటాను. ప్రజలు బాగుంటేనే, మేము బాగున్నట్లు’ అన్నారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ. జంగల్ మహల్ లో ఎన్నికల ప్రచార సభను ఆమె ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉత్సాహపరుస్తూ ఆమె మాట్లాడారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల గురించి భయపడవద్దని, ప్రజల మద్దతుతో ముందుకు వెళ్లామని తన పార్టీ కార్యకర్తలకు మమత సూచించారు. ఇతర రాష్ట్రాల నుంచి ఎవరో వస్తారని భయపడవద్దని, కేవలం మూడురోజుల్లోనే వారు వెనుతిరుగుతారని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్, సీీపీఐ(ఎం)లు తమ పార్టీపై దుష్ప్రచారం చేస్తున్నాయని, వాటిని పట్టించుకోవద్దని మమత పేర్కొన్నారు.