: భారత్ ఆశలు సజీవం...పాకిస్థాన్ ను ఇంటికి పంపిన ఆసీస్!


టీ20 వరల్డ్ కప్ లో భారత్ ఆశలు సజీవంగా నిలిచాయి. మొహాలీ వేదికగా ఆస్ట్రేలియా-పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఆసీస్ జట్టు పాకిస్థాన్ ను 21 పరుగుల తేడాతో ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఆరంభించిన ఆసీస్ కు బ్యాట్స్ మన్ భారీ స్కోరు సాధించిపెట్టారు. వాట్సన్ మెరుపులతో ఆసీస్ 193 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం 194 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన పాకిస్థాన్ జట్టు కీలక సమయాల్లో వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది. దీంతో 21 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. పాకిస్థాన్ ఆటగాళ్లలో షెర్జిల్ ఖాన్ (30), ఖలీద్ లతీఫ్ (46), ఉమర్ అక్మల్ (32), షోయబ్ మాలిక్ (40) రాణించారు. మాలిక్ చివర్లో భారీ షాట్లతో విరుచుకుపడ్డప్పటికీ సహచరుల సహకారం కొరవడడంతో పాక్ ఓటమిపాలైంది. ఆసీస్ బౌలర్లలో జేమ్స్ ఫల్కనర్ 5 వికెట్లతో రాణించి, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. దీంతో టీ20 ప్రపంచ కప్ లో భారత్ ఆశలు సజీవంగా నిలిచాయి. ఆదివారం ఆస్ట్రేలియాతో జరగనున్న మ్యాచ్ లో విజయం సాధిస్తే సెమీస్ కు భారత్ చేరుతుంది. లేని పక్షంలో ఆసీస్ సెమీస్ కు చేరుకుంటుంది.

  • Loading...

More Telugu News