: సియాచిన్లో మరోసారి విరుచుకుపడ్డ హిమపాతం... సైనికుడు గల్లంతు
సియాచిన్లో సైనికులపై హిమపాతం మరోసారి విరుచుకుపడింది. దీంతో ఇద్దరు సైనికులు మంచులో చిక్కుకుపోయారు. ఇక్కడి లడఖ్ టర్టక్ ప్రాంతంలో మంచులో కూరుకుపోయిన ఇద్దరు సైనికుల్లో ఒకరిని కాపాడారు. ఈ సంఘటనలో గల్లంతైన సైనికుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాపాడిన సైనికుడిని దగ్గరలోని మిలటరీ ఆస్పత్రికి తరలించారు.