: కన్న‌య్య మా పార్టీలో చేరాల‌నుకుంటే చేరొచ్చు: కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్


జేఎన్యూ విద్యార్థి నాయకుడు క‌న్న‌య్య‌ కుమార్ కాంగ్రెస్‌ పార్టీలో చేరతానంటే త‌మ‌కు ఎటువంటి అభ్యంతరం లేదని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ సీఎన్ఎన్‌-ఐబీఎన్‌ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే కన్న‌య్యకు వేరే రాజకీయ అనుబంధాలు ఉన్నాయని ఆయన అన్నారు. ఒకవేళ ఆయన కాంగ్రెస్‌లోకి వస్తానంటే, ఎందుకు వ‌ద్దంటాం? అని శశిథరూర్ ప్రశ్నించారు. జాతీయ‌తావాదంపై ఆయన మాట్లాడుతూ.. జాతీయతను ఒక రాజకీయ అంశంగా మార్చిందెవరని ప్రశ్నించారు. ఇది భారతీయ జనతాపార్టీ రాజకీయ వ్యూహమేన‌ని ఉద్ఘాటించారు. బీజేపీ త‌మ‌ విమర్శకులను, వ్యతిరేకులను దేశ వ్యతిరేకులుగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తోంద‌ని వ్యాఖ్యానించారు. అధికార పార్టీయే ప్రభుత్వం కాదనీ, అలాగే ప్రభుత్వమే దేశం కాదని శశిథరూర్ అన్నారు. 'కన్నయ్యకుమార్ ఈ కాలపు భగత్‌సింగ్' అంటూ శ‌శిథ‌రూర్ ఇటీవ‌లే వ్యాఖ్యానించారు. భగత్‌సింగ్ వామపక్ష భావజాలంతో విదేశీ ప్రభుత్వంపై పోరాడారని.. కన్నయ్య మోదీ ప్రభుత్వానికి, దేశంలోని పేదరికానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారని ఆయ‌న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేసిన విష‌యం తెలిసిందే.

  • Loading...

More Telugu News