: ప్రముఖ సినీ నటుడు జయప్రకాష్ రెడ్డికి మాతృవియోగం
ప్రముఖ సినీ నటుడు జయప్రకాష్ రెడ్డి తల్లి తాడిపర్తి సామ్రాజ్యమ్మ(84) అనారోగ్యంతో మృతి చెందారు. ఆమెకు నలుగురు సంతానం కాగా, వారిలో పెద్దకొడుకు జయప్రకాష్ రెడ్డి. రేపు గుంటూరులో ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సమాచారం. కాగా, పలువురు సినీ, రంగస్థల ప్రముఖులు, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు తమ సంతాపం తెలిపారు.