: నేను చ‌నిపోతున్నా.. ఎస్పీకి వాట్సప్ మెసేజ్.. వెంటనే స్పందించిన పోలీసులు!


తాను ఆత్మ‌హ‌త్య చేసుకోబోతున్నానంటూ ఎస్పీకి ఓ వ్య‌క్తి వాట్స‌ప్‌లో మెసేజ్ పెట్టిన ఘ‌ట‌న‌ అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. బీరే మెహన్ అనే వ్యాపారి ఇటీవల వ్యాపారంలో నష్టాలపాలై అప్పుల్లో కూరుకుపోవ‌డంతో తీవ్ర మ‌న‌స్తాపానికి గుర‌య్యాడు. దీంతో బ‌ల‌వ‌న‌ర్మ‌ర‌ణ‌మే ప‌రిష్కార‌మ‌నుకొని నిర్ణ‌యం తీసుకున్నాడు. ఈ విష‌యాన్ని ఎస్పీకి వాట్స‌ప్ ద్వారా తెలియ‌జేయడంతో వెంట‌నే ఆయ‌న‌ స్పందించారు. ఎస్పీ ఆదేశాలతో పోలీసులు మోహన్ను కలుసుకొని ఆత్మహత్యకు పాల్పడొద్దంటూ కౌన్సిలింగ్ నిర్వహించారు.

  • Loading...

More Telugu News