: మలయాళ నటుడు జిష్ణు కన్నుమూత.. దిగ్భ్రాంతిలో మాలీవుడ్


ప్రముఖ మలయాళ నటుడు జిష్ణు రాఘవన్‌(35) శుక్రవారం ఉదయం కన్నుమూశారు. కేన్సర్ తో బాధ పడుతున్న ఆయన శుక్రవారం ఉదయం 8.15 గంటలకు కొచ్చిలోని అమృత ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. జిష్ణు రాఘవన్ మరణంతో మలయాళ సినిమా పరిశ్రమ దిగ్భ్రాంతిలో మునిగిపోయింది. రెండేళ్ల క్రితం ఆయన కేన్సర్ బారిన పడ్డారు. చికిత్స తీసుకోవడంతో కేన్సర్ నుంచి పూర్తిగా కోలుకున్నారని భావించారు. ఏడాది క్రితం మళ్లీ కేన్సర్ తిరగబెట్టడంతో ఆయన ఆస్పత్రి పాలయ్యారు. ప్రముఖ నటుడు రాఘవన్ కుమారుడైన జిష్ణు 1987లో 'కిల్లిపట్టు' సినిమాతో బాలనటుడిగా నటజీవితం మొదలు పెట్టారు. కొంత కాలంగా గ్యాప్ ఇచ్చిన జిష్ణు ఇంజనీరింగ్ పూర్తి చేసి సినిమా ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. ఆ త‌ర్వాత‌ జిష్ణు హీరోగా నటించిన మొదటి చిత్రం 'నమ్మాల్' ఘన విజయం సాధించింది.

  • Loading...

More Telugu News