: కేజ్రీవాల్ ను ఫాలో అవుతున్న మోదీ...ట్విట్టర్ లోనే సుమా!


దాదాపు 70 లక్షల మందికి పైగా ఫాలోవర్లను తన ట్విట్టర్ ఖాతాలో కలిగివున్న అరవింద్ కేజ్రీవాల్ ఖాతాలోకి ఇప్పుడు మోస్ట్ హై ప్రొఫైల్ వ్యక్తి వచ్చి చేరారు. కేజ్రీ ఫాలోవర్ గా ప్రధాని నరేంద్ర మోదీ జాయిన్ అయ్యారు. ఈ విషయాన్ని కేజ్రీవాల్ స్వయంగా వెల్లడిస్తూ, "నన్ను ఫాలో అవుతున్నందుకు థ్యాంక్యూ సర్. హోలీ శుభాకాంక్షలు. భవిష్యత్తులో కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాల మధ్య మరింత మంచి సహాయ సహకారాలు ఉండాలని కోరుకుంటున్నా" అని ట్వీట్ చేశారు. కాగా, ప్రధాని మోదీ ప్రస్తుతం దాదాపు 1400 మందిని ట్విట్టర్ లో ఫాలో అవుతున్నారు. ఆయన్ను ఫాలో అవుతున్న వారి సంఖ్య 1.88 కోట్లుగా ఉండగా, ఇండియాలో ఆయనకన్నా ముందు అమితాబ్ బచ్చన్ 2 కోట్ల మంది ఫాలోవర్లతో నెంబర్ వన్ గా నిలిచారు.

  • Loading...

More Telugu News