: పదవిలో ఉన్నాం కదాని ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ఏదో ఒక రోజు రోడ్డుపైకి రాక తప్పదు: మోహన్ బాబు


విలక్షణ నటుడు మోహన్ బాబు వర్తమాన రాజకీయాలపై తనదైన శైలిలో సెటైర్లు విసిరారు. కడప జిల్లా రాజంపేటలోని అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాల వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన, విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. "రాజకీయాల్లో నేనిప్పుడు లేను. రేపు వస్తే ... ఏ పార్టీలోకి వస్తానో కూడా తెలియదు. కానీ, బండి ఒక నదిలో వెళ్లాలంటే... నదిలో పడవ బండిని మోస్తుంది. అదే పడవ ఒడ్డుకు చేరిన తరువాత, బండి పడవను మోస్తుంది. పదవిలో ఉన్నాం కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే, ఏదో ఒక రోజు రోడ్డుపైకి రాకతప్పదు ఎవరైనా" అని అన్నారు. మాతృభాషను మరవకుండా ఆంగ్లంలో పట్టును సాధించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. విద్యాభాస్యంలో మెరుగైన ప్రదర్శన కనబరిచిన వారికి ప్రోత్సాహక బహుమతులను మోహన్ బాబు అందించారు.

  • Loading...

More Telugu News