: తాత్కాలిక రాజధానికి నేడు చంద్రబాబు... పనులను ప్రత్యక్షంగా పరిశీలించనున్న వైనం
ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నేడు నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిలో పర్యటించనున్నారు. నేటి మధ్యాహ్నం ప్రత్యేక హెలికాప్టర్ లో విజయవాడ నుంచి గుంటూరు జిల్లా వెలగపూడికి వెళ్లనున్న చంద్రబాబు అక్కడ జరుగుతున్న తాత్కాలిక రాజధాని పనులను ప్రత్యక్షంగా పరిశీలించనున్నారు. అనంతరం, ఈ నిర్మాణాలను చేబట్టిన ఎల్ అండ్ టీ, షాపూర్జీ పల్లోంజీ సంస్థల ప్రతినిధులతోనూ ఆయన సమావేశమవుతారు. పనుల్లో నాణ్యత, టైం బౌండ్ లోగా పనులు పూర్తి చేసే విషయాలపై ఆయన ఆ కంపెనీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయనున్నట్లు సమాచారం.