: ఏబీవీపీ ఏం చెబితే బీజేపీ అది చేస్తోంది...ఇది మంచిది కాదు: వీహెచ్
బీజేపీ అనుబంధ విద్యార్థి సంస్థ ఏబీవీపీ ఏం చెబితే కేంద్రం అది చేస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ మండిపడ్డారు. హెచ్సీయూలో మెస్ ల మూసివేతపై హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, హెచ్ఆర్డీ శాఖ గుడ్డిగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఏబీవీపీ ఏం చెబితే అది చేస్తోందని ఆరోపించారు. కేవలం వీసీ కోసం వందలాది మంది విద్యార్థుల ప్రయోజనాలను గాలికి వదిలేస్తోందని మండిపడ్డారు. వీసీకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తే...మెస్ లు మూసేయడమేంటని ఆయన ప్రశ్నించారు. కేవలం వీసీకి అనుకూలంగా వ్యవహరిస్తూ స్టూడెంట్స్ ను ఇబ్బంది పెట్టడం సరికాదని ఆయన సూచించారు.