: పీడీపీ శాసనసభాపక్షనేతగా మెహబూబా ముఫ్తీ ఏకగ్రీవం, సీఎం పగ్గాలు చేపట్టడం ఇక లాంఛన ప్రాయమే!


జమ్మూకాశ్మీర్ లో రాజకీయ అనిశ్చితికి తెరపడే అవకాశం లభించనుంది. పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) శాసనసభాపక్షనేతగా మెహబూబా ముఫ్తీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈరోజు జరిగిన ముఖ్యమైన సమావేశంలో ఆమెను ఎన్నుకున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. శాసనసభా పక్షనేతగా ఎన్నిక కావడంతో ముఖ్యమంత్రిగా ఆమె పగ్గాలు చేపట్టడం ఇక లాంఛన ప్రాయమే. జమ్మూకాశ్మీర్ లో ప్రభుత్వం ఏర్పాటు విషయమై ప్రధాని నరేంద్ర మోదీని ఆమె కలిసిన విషయం తెలిసిందే. పీడీపీకి మద్దతు ఇచ్చేందుకు బీజేపీ సుముఖంగానే ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు మెహబూబా ముఫ్తీ సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఆమె రేపు గవర్నర్ ను కలవనున్నట్లు తెలుస్తోంది. జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రిగా ఆమె పగ్గాలు చేపడితే కనుక, తొలి మహిళా సీఎంగా ఆమె రికార్డులకెక్కుతుంది. కాగా, సమావేశానికి హాజరవడానికి ముందు అనంత్ నాగ్ జిల్లాలో ఉన్న తన తండ్రి ముఫ్తీ మహ్మద్ సయీద్ సమాధిని ఆమె దర్శించుకున్నారు.

  • Loading...

More Telugu News