: అమితాబ్, చిరులను ఆహ్వానించిన నడిగర్ సంఘం
ఏప్రిల్ 17 నుంచి చెన్నై వేదికగా 'నడిగర్ సంఘం' నిర్వహించే స్టార్ క్రికెట్ మ్యాచ్ లు ప్రారంభం కానున్నాయి. సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (నడిగర్ సంఘం) నిర్వహించనున్న స్టార్ క్రికెట్ మ్యాచ్ లకు హాజరు కావాలంటూ బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి ఆహ్వానం పంపించారు. టోర్నీ ప్రారంభోత్సవానికి వీరిద్దరూ హాజరుకానున్నట్టు తెలుస్తోంది. కాగా, ఈ సందర్భంగా బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ తో పాటు, కోలీవుడ్ స్టార్ లు రజనీకాంత్, కమల్ హాసన్, చిరంజీవి ఒకే వేదికపై సందడి చేయనున్నారు. ఈ టోర్నీలో మొత్తం ఆరు మ్యాచ్ లు జరిగే అవకాశం ఉండగా, మొత్తం 48 మంది నటీనటులు పాల్గొంటారు.