: అసెంబ్లీని మీ ‘లోటస్ పాండ్’ అనుకుంటున్నారా?: జగన్ పై మండిపడ్డ కామినేని
ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్ మండిపడ్డారు. అసెంబ్లీని జగన్ తన లోటస్ పాండ్ అనుకుంటున్నారేమో, ఎప్పుడుపడితే అప్పుడు అవిశ్వాసాలు పెడుతున్నారంటూ ఆయన విమర్శించారు. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న జగన్ కు సీఎం చంద్రబాబును విమర్శించే అర్హతలేదని అన్నారు. గతంలో సీబీఐ జేడీగా లక్ష్మీనారాయణ ఉన్న సమయంలో జగన్ కుక్కిన పేనులా పడున్నారని, ఆయన బదిలీ అయిన తర్వాతే జగన్ కు బెయిల్ వచ్చిందని కామినేని విమర్శలు గుప్పించారు.