: కాశ్మీర్ విషయంలో కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఉమర్ ఫరూఖ్
కాశ్మీర్ విషయంలో కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవాలని హుర్రియత్ కాన్ఫరెన్స్ ఛైర్మన్ మీర్వాయిజ్ ఉమర్ ఫరూఖ్ అన్నారు. న్యూఢిల్లీ లోని పాకిస్థాన్ హైకమిషనర్ ఆహ్వానంపై ఆయనతో లంచ్ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాశ్మీర్ అంశం చాలా క్లిష్టమైనది కావడం వల్ల కాశ్మీర్ విషయంలో కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. భారత్-పాకిస్థాన్ మధ్య చర్చలు జరగడానికి ఇది సరైన సమయమని మీర్వాయిజ్ ఉమర్ ఫరూఖ్ అన్నారు. పాక్ హైకమిషనర్‌తో భేటీలో తాము పఠాన్‌కోట్ దాడి అంశంపై చర్చించామని ఆయన చెప్పారు. పాకిస్తాన్ దర్యాప్తు బృందం ఇక్కడకు రావడంపై వారు దృష్టి కేంద్రీకరించారని ఆయన అన్నారు.