: అలాంటి వాళ్లే పండుగలు జరుపుకుంటారు: దర్శకుడు వర్మ
తమ పనిని ప్రేమించని వారే పండుగలు జరుపుకుంటారని ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ అన్నారు. "పనిని ప్రేమించే వారు పండుగలను అసహ్యించుకుంటారని, జీవితంలో ఫెయిల్ అయిన వారు, ఏదైనా పోగొట్టుకున్న వారు మాత్రమే పండుగలను జరుపుకుంటారు. 'హిరణ్య కశిపుడుని హతమార్చారన్న సంతోషంతో మీరందరూ హోలీ వేడుకలను జరుపుకుని సంతోషిస్తారు. కానీ, నా మటుకు నేను ‘భంగ్’ తాగడం ... వంటి వాటిని వేడుకగా జరుపుకుంటాను. హోలీకి సంబంధించి సంతోషించదగ్గ విషయం ఒకే ఒక్కటి ఉంది. అమ్మాయిలు తడిసిపోయిన దుస్తుల్లో ఉన్నప్పటికీ, పెద్దవాళ్లు ఎటువంటి ఆక్షేపణలు పెట్టరు" అని వర్మ తన ట్వీట్లలో పేర్కొన్నారు.