: కన్నయ్య కాన్వాయ్ లో ప్రమాదం
ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విద్యార్థి సంఘం నేత కన్నయ్య కుమార్ హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే నిమిత్తం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ప్రయాణిస్తున్న వేళ, ఆయన కాన్వాయ్ లో స్వల్ప ప్రమాదం చోటు చేసుకుంది. కన్నయ్యతో పాటు కలసి సీపీఐ నేత నారాయణ ఒకే వాహనంలో ప్రయాణిస్తుండగా ఈ ఘటన జరిగింది. కన్నయ్య వాహనం, వారికి ముందు వెళుతున్న పోలీస్ ఎస్కార్ట్ వాహనం, కన్నయ్యను కవర్ చేసేందుకు ప్రయత్నిస్తున్న మీడియా వాహనం ప్రమాదవశాత్తూ ఢీకొన్నాయి. ఆపై వెనకే వస్తున్న మరో రెండు వెహికిల్స్ సడన్ బ్రేక్ వేయడంతో ఒకదానికి ఒకటి ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని తెలుస్తోంది.