: ‘వాట్సప్’లో ఎస్ఎస్సీ ప్రశ్నాపత్రం లీక్!


తెలంగాణ రాష్ట్రానికి చెందిన పదో తరగతి హిందీ ప్రశ్నాపత్రం వాట్సప్ ద్వారా లీకైయిందన్న సమాచారంతో విద్యాశాఖాధికారులు అప్రమత్తమయ్యారు. పరీక్ష నిర్వహణను కట్టుదిట్టం చేశారు. మహబూబ్ నగర్ జిల్లా కొత్తకోటలో ఈరోజు 10వ తరగతి హిందీ పరీక్ష జరుగుతుండగా, ఈ వదంతులు వ్యాపించాయి. పరీక్ష ప్రారంభమైన అర్ధగంటలోనే ఈ ప్రశ్నాపత్రం వాట్సప్ లో వచ్చిందన్న వార్తలతో విద్యాశాఖాధికారులు అలెర్ట్ అయ్యారు. కాగా, ఈ విషయాన్ని జిల్లా విద్యాశాఖాధికారి దృష్టికి తీసుకువెళ్లగా,‘అదేమి లేదంటూ’ కొట్టిపారేశారు.

  • Loading...

More Telugu News