: చిరంజీవికి మరో శస్త్రచికిత్స!
మెగాస్టార్ చిరంజీవి తన కుడి భుజానికి గత నెలలో ఆపరేషన్ చేయించుకున్న విషయం తెలిసిందే. కాగా, ఎడమ భుజానికి కూడా ఆయన త్వరలో ఆపరేషన్ చేయించుకోనున్నట్లు చిరంజీవి సన్నిహిత వర్గాల సమాచారం. త్వరలో చిరంజీవి చిన్న కూతురు శ్రీజ వివాహం జరగనుందని, ఆ తర్వాత ఈ ఆపరేషన్ చేయించుకుంటారని అంటున్నారు. కాగా, చిరంజీవి కుడి భుజానికి ఆమధ్య ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో ఆపరేషన్ జరిగింది. ఎడమ భుజానికి కూడా ఆపరేషన్ జరిగి, కోలుకున్న తర్వాత ఆయన 150వ చిత్రం షూటింగ్ ప్రారంభిస్తారని సమాచారం.