: స్టేడియం బయట కూర్చుని కబుర్లు చెప్పడం చాలా తేలిక: టీమిండియా కెప్టెన్ ధోని
స్టేడియం బయట కూర్చుని మ్యాచ్ గురించి విశ్లేషించడం, కబుర్లు చెప్పడం చాలా తేలికని టీమిండియా కెప్టెన్ ధోని తనదైన శైలిలో విలేకరులకు సమాధానమిచ్చారు. టీ20 వరల్డ్ కప్ లో భాగంగా బెంగళూరు వేదికగా నిన్న జరిగిన భారత్-బంగ్లా మ్యాచ్ లో టీమిండియా కేవలం ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. ‘బంగ్లాదేశ్ పై టీమిండియా ప్రదర్శించిన ఆటతీరుతో మీరు సంతృప్తి చెందారా?’ అంటూ విలేకరులు ధోనీని ప్రశ్నించగా, ‘ఈ మ్యాచ్ లో టీమిండియా గెలవడం నాకు చాలా సంతోషంగా ఉంది’ అంటూ సీరియస్ గా సమాధానమిచ్చాడు.