: అసభ్య మెయిల్స్ పంపుతున్న టాలీవుడ్ నిర్మాతపై కేసు
మాజీ మంత్రి టీడీపీ నేత మాగంటి వెంకటేశ్వరరావు (బాబు) కుమారుడు రామచంద్రన్ అలియాస్ రాంజీపై సైబరాబాద్ కమిషనరేట్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది. మహిళలను కించపరిచేలా మెయిల్స్ పంపుతున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలో విచారణ చేపట్టిన పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. రాంజీని అరెస్ట్ చేసేందుకు సైబరాబాద్ పోలీసులు ఏలూరు వెళ్లారు. నిర్మాతగా ఉన్న రాంజీ టాలీవుడ్ లో ఇప్పటికే 'తూనీగ తూనీగ' అనే చిత్రాన్ని నిర్మించారు.