: ఫుడ్ పాయిజన్, మూడో తరగతి చిన్నారి మృతి
అనంతపురం జిల్లాలోని ఒక కోచింగ్ సెంటర్ లో ఫుడ్ పాయిజన్ కారణంగా ఒక చిన్నారి మృతి చెందింది. పరిగి మండలంలోని సేవామందిర కాలనీలో ఉన్న పద్మసాయి కోచింగ్ సెంటర్ లో ఫుడ్ పాయిజన్ అవడంతో మూడో తరగతి చదువుతున్న నిఖిత చనిపోగా, 20 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. కోచింగ్ సెంటర్ లో జరిగిన దారుణంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని నిఖిత తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటనపై మిగిలిన విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, కోచింగ్ సెంటర్ నిర్వాహకులు పరారీలో ఉన్నారు.